సీసీ కెమెరాలు ప్రారంభం
19-09-2026 | 11:50pm
బోయినపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) బోయినపల్లి మండలంలోని వెంకట్రావు పల్లి గ్రామ(Venkatravupalli village) చౌరస్తా వద్ద శనివారం సాయంత్రం నాలుగు సీసీటీవీ కెమెరాలను(CCTV cameras) వేములవాడ రూరల్ సీఐ ఎం శ్రీనివాస్, వెంకట్రావుపల్లి సర్పంచ్ ఇరువాలా సంధ్యా మహేందర్ కలిసి ప్రారంభించారు.అన్ని గ్రామాల ప్రజలు సీసీటీవీ కెమెరాలను పెట్టుకోవాలని ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో బోయినపల్లి ఎస్ ఐ రమాకాంత్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.