యాదవ మహాసభ అధ్యక్షుడిగా కొయ్యడ సతీష్ యాదవ్
కమాన్‌పూర్, అక్టోబర్ 04 (విజయక్రాంతి): అఖిల భారత యాదవ మహాసభ కమాన్‌పూర్ మండల అధ్యక్షుడిగా రొంపికుంట గ్రామానికి చెందిన కొయ్యడ సతీష్ యాదవ్(Koyyada Satish Yadav) నియమితులయ్యారు. ఈ మేరకు అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేశం యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సందవేణి రాజేందర్ యాదవ్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
మండల ఉపాధ్యక్షులుగా అల్లి సురేష్ యాదవ్ (జూలపల్లి), మేకల శంకర్ యాదవ్(గొల్లపల్లి), ప్రధాన కార్యదర్శిగా మానుక స్వామి యాదవ్ (కమాన్‌పూర్), కార్యదర్శిగా చిగుర్ల భూమన్న యాదవ్ (గొల్లపల్లి), సంయుక్త కార్యదర్శిగా ఎంచర్ల శంకర్ యాదవ్ (గొల్లపల్లి), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా డబ్బేట శ్రీనివాస్ యాదవ్(కమాన్‌పూర్), కోశాధికారిగా బాగారపు పర్వతాలు (నాగారం), సభ్యుడిగా పోగుల తిరుపతి యాదవ్‌ను నియమించినట్లు తెలిపారు. యాదవుల ఐక్యత, సంక్షేమం, హక్కుల సాధన కోసం నూతన కమిటీ సమష్టిగా కృషి చేయాలని జిల్లా నాయకులు ఆకాంక్షించారు.