మూడు తారలను ముంచిన ముసలి నక్క కాంగ్రెస్
కరీంనగర్, సెప్టెంబర్05(విజయక్రాంతి): మూడు తరాలను తెలంగాణలో ముంచిన ముసలి నక్క.. ఏది ఆ నక్క.. ఎవరు ఆ ముసలి నక్క కాంగ్రెస్(Congress party).. ఆనాడు 1956లో తెలంగాణకు, ఆంధ్రకు ఇష్టంలేని బలవంతపు పెళ్లి చేసింది ముసలి నక్క కాంగ్రెస్.. ఆ తర్వాత 1968లో 370 మందిని కాల్చి చంపిన ముసలి నక్క కాంగ్రెస్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ధ్వజమెత్తారు.
కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో(Karimnagar Ambedkar Stadium) బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించబ యువ సమరభేరి కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. 1971లో 11 మంది పార్లమెంట్ సభ్యులను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే, మా తెలంగాణ మాకు కావాలే అని పోరాటం చేస్తే వాళ్లను గుంజుకొని పోయి కాంగ్రెస్‌లో కలుపుకుని తెలంగాణ ఇయ్యకుండా వేల మంది ప్రాణాలు బలిగొన్నది కాంగ్రెస్ అని ఫైర్ అయ్యారు.
2004లో ఇదే కరీంనగర్ గడ్డ మీద సోనియా గాంధీ మీ మనసులో ఏముందో నాకు తెలుసు.. తెలంగాణ ఇస్తా అని చెప్తే పొత్తు పెట్టుకున్నం. కానీ పదేండ్లు సతాయించి సావగొట్టి శ్రీకాంత్ చారి లాంటి తమ్ముళ్లు వందల మందిని బలితీసుకుని ఆఖరికి తెలంగాణ ఇయ్యకపోతే వీపు చింతపండు అయితది.. కాంగ్రెసోళ్లు బయట తిరిగే పరిస్థితి ఉండదని.. అప్పుడు కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆనాడు లడాయి చేస్తే దిగివచ్చిన దిక్కుమాలిన ముసలి నక్క కాంగ్రెస్ అని కేటీఆర్ విమర్శించారు.
యువతకు స్కిల్ లేదంటున్న రేవంత్ రెడ్డి.. ఓటుకు నోటు దొంగ అంటూ వ్యాఖ్యానించారు. లక్కీ లాటరీ తగిలి రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. ప్రధాని మోదీని గడగడలాడించిన యువతకు రేవంత్ ఓ లెక్క కాదన్నారు. తెలంగాణ యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద మాటలు చెప్పారని.. ఇప్పుడేమైందని ప్రశ్నించారు. జాబులు లేవని.. నోటిఫికేషన్‌లు లేవన్నారు. లూటిఫికేషన్‌లు మాత్రం బ్రహ్మండంగా నడుస్తున్నాయని మండిపడ్డారు. వందరోజుల హామీలు నెరవేర్చక వెయ్యిరోజులు అవుతోందని అన్నారు






