17 August, 2026 | 12:12 AM

Districts - Karimnagar

article_70387405.webp
ప్రధాని మోదీ ఫోటో ముద్రించాలి

ముకరంపుర, ఆగస్టు 16(విజయ క్రాంతి): దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 21 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు, దాదాపు 90 కోట్ల మంది జనాభాకు ప్రతినెల ఒక్కొక్క వ్యక్తికి ఉచితంగా ఐదు కేజీల బియ్యం అందించడం జరుగుతుందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు. నరేంద్ర మోడీ పేద ప్రజలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో 'ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన' పథకం కింద రాష్ట్రంలోని 2 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ బియ్యం అందిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టకపోవడం శోచనీయమని ఆదివారం ఒక పత్రిక ప్రకటన ద్వారా విచారం వ్యక్తం చేశారు.

16-08-2026

article_19957546.webp
రంగపేటలో అభివృద్ధి పనులకు భూమిపూజ

మానకొండూరు, ఆగస్టు 16(విజయక్రాంతి): మానకొండూర్ మండలం రంగపేట గ్రామంలో రూ.1.61 కోట్ల వ్యయంతో గోదాం ప్రహరీ గోడ, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులకు, ఆదివారం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రజలకు అవసరమైన రహదారులు, పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

16-08-2026

article_36396957.webp
ప్రతిభకు వేదికగా బాస్కెట్‌బాల్ టోర్నమెంట్

కరీంనగర్ క్రైమ్ ఆగష్టు 16(విజయక్రాంతి): అంబేద్కర్ స్టేడియంలో ఔల్ క్లబ్ (ఔల్ క్లబ్ ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికితీసే లక్ష్యంతో అండర్-14, అండర్-17, అండర్-19 విభాగాలలో ఈ పోటీలను ఏర్పాటు చేశారు. ​ఈ టోర్నమెంట్‌ను కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, బిర్లా ఓపెన్ మైండ్స్ అండ్ ట్రినిటీ చైర్మన్ డి. ప్రశాంత్ రెడ్డి, తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ సీనియర్ ప్రెసిడెంట్ మహిపాల్, కిస్నా గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ ప్రతినిధి వరుణ్ సంయుక్తంగా ప్రారంభించారు.

16-08-2026

article_23115407.webp
పరిపాలనా భవనంలో జెండా ఎగురవేసిన ఉపకులపతి

ముకరంపుర, ఆగస్టు 15(విజయ క్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్ పరిపాలనా భవన ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ... విద్యా ప్రమాణాలు, క్యాంపస్ సౌకర్యాల లక్ష్యంగా శాతవాహన విశ్వవిద్యాలయం ఒక పరివర్తన దశలోకి ప్రవేశిస్తుందని అన్నారు. సైన్స్ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ రమాకాంత్, న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతి, కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీరంగప్రసాద్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీశైలం ఉద్యోగులు, విద్యార్థులతో జాతీయ పతాకం ఎగరవేసారు.

15-08-2026

article_39075708.webp
వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన నగర మేయర్

ముకరంపుర, ఆగస్టు 15(విజయ క్రాంతి): స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 7వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని మినీ ఇండోర్ స్టేడియం గ్రౌండ్‌ లో నిర్వహించిన వనమహోత్సవ బ్లాక్ ప్లాంటేషన్ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి పౌరుడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 200 మొక్కలు నాటడం జరిగిందని నాటిన ప్రతి మొక్కను కాపాడినప్పుడె వనమహోత్సవ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సువార్త , స్థానిక కార్పొరేటర్ ఆకుల నందిని ఉదయ్ , నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు, యువత, కాలనీ వాసులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

15-08-2026

article_76407009.webp
సిపిఐ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన పంజాల శ్రీనివాస్

ముకరంపుర, ఆగస్టు 15(విజయక్రాంతి): భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 79 సంవత్సరాలు గడిచి 80వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నా దేశంలో పేదల బ్రతుకులు మారడం లేదని,పాలకులు అందించే సంక్షేమ పథకాలు అందరికీ అందడం లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను శ్రీనివాస్ ఎగురవేశారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలని జరిగిన వీరోచిత పోరాటంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందని,ఎందరో మహానుభావులు ఆ ఉద్యమంలో పాల్గొన్నారని, స్వాతంత్ర్యం అనంతరం దేశంలో పరిపాలన కొనసాగించిన పేదల బ్రతుకులు మారడం లేదనీ దేశ స్వాతంత్ర్య ఉద్యమం మొదలుకొని నేటి వరకు సిపిఐ ప్రజల పక్షాన నిలబడి వారి హక్కులు,సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సిపిఐ పోరాడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి,నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

15-08-2026