5 September, 2026 | 3:29 PM

మోదీనే వణికిపోయారు.. రేవంత్ ఎంత!

05-09-2026 | 01:51pm

కరీంనగర్: యువతరం పోరాటానికి ప్రధాని మోదీనే(Prime Minister Modi) వణికి పోయారు.. రేవంత్ రెడ్డి ఎంతని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో యువతను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ 1,000 రోజుల దగాపై యువ సమరభేరి సభలో కేటీఆర్ పాల్గొన్నారు. నిరుద్యోగుల సమస్యలపై రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఈ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. తెలంగాణను దశాబ్ధాలపాటు కాంగ్రెస్ మోసం చేసిందన్న కేటీఆర్ అలాంటి కాంగ్రెస్ ను నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారని వెల్లడించారు. అప్పుడు యూత్ డిక్లరేషన్(Congress Youth Declaration ).. ఇప్పుడు బూతు డిక్లరేషన్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు స్కిల్ లేదని రేవంత్ రెడ్డి అంటున్నారు.. సీఎం రేవంత్ కు స్కిల్ ఉందా? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారని స్పష్టం చేశారు.

కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) రాజీనామా చేయాలని అంటున్నారు.. తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ రాజీనామా(KCR's resignation) చేయాలా? వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్ రాజీనామా చేయాలా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక్క మంత్రిని బర్తరఫ్ చేయడం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. 1000 రోజుల్లో కాంగ్రెస్(Congress's 1,000-Day Rule) 16 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని కేటీఆర్ విమర్శించారు. రీ-నోటిఫికేషన్ల తీసేస్తే 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. పదేళ్లలో 2.32 లక్షల ఉద్యోగాలు తాము భర్తీ చేశామని లెక్కచెప్పారు. దీనిపై చర్చకు కాంగ్రెస్ సిద్ధమా? అని సవాల్ చేశారు. ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్, మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు,




మరిన్ని వార్తలు