వెబ్సైట్ ఆవిష్కరణ
19-09-2026 | 04:54pm
నిర్మల్,(విజయక్రాంతి): మున్నూరు కాపుల సభ్యత్వ(munnuru kapu membership) నమోదు వెబ్సైట్ ఆవిష్కరణ నిర్మల్ పట్టణంలో తెలంగాణ మున్నూరు కాపు సంఘం (పటేల్స్) ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కోసం రూపొందించిన వెబ్సైట్ను రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి(Nirmal Municipal Vice Chairman Ganesh Chakravarthy) ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మున్నూరు కాపుల జనాభాను తక్కువగా చూపిస్తూ గణాంకాలు నమోదు చేశారని అన్నారు. వాస్తవానికి మున్నూరు కాపుల జనాభా కోటి మందికి పైగా ఉందని, అయితే అధికారిక గణాంకాల్లో 20 లక్షల లోపుగా చూపించడం వాస్తవ విరుద్ధమని పేర్కొన్నారు