రిచ్ లుక్స్ కిడ్స్ మెన్స్ వేర్ ప్రారంభం
వ్యాపార రంగంలో యువత ముందుకు రావాలి
కమాన్ పూర్ లో ఏర్పాటు చేసిన రిచ్ లుక్స్ కిడ్స్ మెన్స్ వేర్ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు
కమాన్‌పూర్, సెప్టెంబర్ 24(విజయ క్రాంతి) కమాన్‌పూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన రిచ్ లుక్స్ కిడ్స్ మెన్స్ వేర్ వస్త్ర దుకాణాన్ని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు(Duddilla Srinu Babu) గురువారం ప్రారంభించారు. సిద్దిపల్లి గ్రామానికి చెందిన బిళ్ల హరీష్ ఈ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ.. యువత స్వయం ఉపాధి, వ్యాపార రంగాల్లోకి అడుగుపెట్టి ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. నూతనంగా ఏర్పాటు చేసిన వస్త్ర దుకాణం ప్రజల ఆదరణ పొందుతూ మంచి పేరు సంపాదించాలని, వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని నిర్వాహకుడు బిళ్ల హరీష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
వినియోగదారులకు నాణ్యమైన వస్త్రాలను అందిస్తూ నమ్మకమైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.