5 September, 2026 | 9:46 PM

హైదరాబాద్‌లో 22A భూముల మహాధర్నాకు తరలి వెళ్లిన బీజేపీ నాయకులు

05-09-2026 | 08:08pm

బాన్సువాడ,(విజయక్రాంతి): 22A నిషేధిత భూముల జాబితా(22A List of prohibited lands)ను రద్దు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద 22A నిషేధిత భూముల జాబితాకు వ్యతిరేకంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న బీజేపీ మహాధర్నాకు మద్దతుగా శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రం నుండి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు.

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress governmentప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పేద, మధ్యతరగతి ప్రజల ప్రైవేట్ పట్టా భూములను, ఇళ్లను 22A నిషేధిత జాబితాలో చేర్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. దీనివల్ల ప్రజలు అత్యవసర సమయాల్లో భూములు అమ్ముకోలేక, బ్యాంక్ లోన్లు రాక విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ధరణి పోర్టల్(Dharani Portal) కంటే ఇప్పుడు తెచ్చిన ‘భూ భారతి’ ద్వారా ప్రజల భూములపై మరిన్ని వివాదాలు సృష్టిస్తూ ప్రభుత్వం వేధిస్తోందని విమర్శించారు. 

మరిన్ని వార్తలు