ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

18-09-2026 | 12:13am

కరీంనగర్ క్రైం, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): కరీంనగర్(Karimnagar) రూరల్ మండలంలోని ఇరుకుల్ల గ్రామానికి చెందిన బిజిలి రాజయ్య (45) అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో  ఆత్మహత్య కు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు రాజయ్య తన కుమార్తె వివాహం నిమిత్తం గర్రేపల్లి గ్రామానికి చెందిన బిజిలి మల్లయ్య వద్ద లక్ష అప్పుగా తీసుకున్నాడు.

అప్పు చెల్లించడంలో ఆలస్యం కావడంతో మల్లయ్య రాజయ్యను డబ్బుల కోసం ఇబ్బంది పెట్టినట్లు  ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రాజయ్య తీవ్ర మనోవేదనకు గురై ఇంటికి వచ్చి మరుసటి రోజు ఉదయం సుమారు 9 గంటల సమయంలో రాజయ్య తల్లి అన్నం తీసుకువచ్చి తినమని చెప్పగా, రాజయ్య అన్నం తినకుండా పక్కన పెట్టి ఇంటి తలుపులు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోపల ఉన్నాడు. రాజయ్య భార్య బిజిలి రమ  ఇంటికి వచ్చి తలుపులు తెరిచి చూడగా, రాజయ్య ఇంట్లో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. 

వెంటనే ఆమె చుట్టుపక్కల వారిని పిలిచి సహాయంతో రాజయ్యను కిందకు దించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న కరీంనగర్ రూరల్ పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతుడి భార్య రమ నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి మృతదేహానికి పంచనామా నిర్వహించి, శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి మరణానికి కారణమైన బిజిలి మల్లయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  కరీంనగర్ రూరల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అనుముల నిరంజన్ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు