రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

09-09-2026 | 08:14am

చండ్రుగొండ,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి చండ్రుగొండ మండలంలో (Chandrugonda) చోటు చేసుకుంది. మృతుడి బంధువులు, గ్రామస్తులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామానికి చెందిన ముస్తఫా (47) తన ద్విచక్ర వాహనంపై గ్రామంలోని జాతీయరహదారి (National Highway) ప్రక్కన గల తన ఇంటికి వెళ్లే క్రమంలో కొత్తగూడెం (Kothugudem) నుండి చండ్రుగొండ వైపునకు వెళ్తున్న ఆటో అతివేగంగా ముస్తాఫా వాహనాన్ని డీకొట్టడంతో వెంటనే స్థానికులు హుటహుటిని క్షతగాత్రున్ని చండ్రుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రున్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిన్నట్లు నిర్దారించారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం కలరు. ఇంటి వద్దనే ప్రమాదం జరగటం, వెంటనే మృతి చెందటంతో ముస్తఫా కుటుంబంలో విషాధచాయలు అలముకున్నాయి.

మరిన్ని వార్తలు