​కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి: నిందితుడి అరెస్ట్, రిమాండ్...

18-09-2026 | 12:01am

ఉట్నూర్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండలం(Indravelli Mandal)లోని  వాల్గొండ గ్రామానికి చెందిన కినక మల్కు పటేల్ తన మొక్కజొన్న ’ పత్తి పంటను అడవి పందుల బారి నుండి రక్షించుకోవడానికి చేను చుట్టూ జి.ఐ. (GI) వైర్ ఏర్పాటు చేసుకున్నారు. దానికి అక్రమంగా ట్రాన్స్‌ఫార్మర్ నుండి విద్యుత్ సప్లై సరఫరా ఏర్పాటు చేశారు.

వాల్గొండ గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన మడావి నీలకంఠ(30) అనే వ్యక్తి ప్రతిరోజూ రాత్రి వేళల్లో తన పంట చేను కావలికి వెళ్తుంటాడని ఎస్ఐ సాయన్న తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 14న పంట కావలి కోసం వెళ్లిన నీలకంఠ, ఉదయానికల్లా తిరిగి రాలేదు.

దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు, బంధువులు అతని కోసం వెతకగా... మల్కు పటేల్ చేనులో అమర్చిన విద్యుత్ తీగలు తగిలి నీలకంఠ అక్కడికక్కడే మరణించినట్లు గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందులోని పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఉట్నూరు సీఐ  మాడవి ప్రసాద్ ఆధ్వర్యంలో నిందితుడు మల్కు పటేల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల విజ్ఞప్తి...

రైతులెవరూ తమ పంటల సంరక్షణ కోసం ట్రాన్స్‌ఫార్మర్ల నుండి అక్రమంగా విద్యుత్ వైర్లు లాగకూడదని, ఇటువంటి చర్యలు తీవ్ర నేరమని మరియు ఇతరుల ప్రాణాలకు ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు