19 August, 2026 | 12:11 PM

పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం

19-08-2026 11:37 AM

హైదరాబాద్: పాతబస్తీలో బుధవారం తెల్లవారుజామున ఒక భవనం మూడవ అంతస్తులో భారీ అగ్నిప్రమాదం(Fire Breaks Out) సంభవించింది. హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతే దర్వాజా(Fateh Darwaja) ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తూ, అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేరు, అలాగే ఎటువంటి ప్రాణనష్టం కూడా సంభవించలేదని అధికారులు తెలిపారు. అందిన సమాచారం ప్రకారం, మూడు అంతస్తుల భవనంలోని మూడవ అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించారు. షార్ట్ సర్క్యూట్(Short circuit) కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి.