ఛాతీలోకి విస్తరించిన భారీ థైరాయిడ్
కణితి తొలగించి కేర్ ఆస్పత్రి వైద్యులు
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): సూడాన్‌కు చెందిన 37 ఏళ్ల మహిళకు హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్స్(CARE Hospitals), హైటెక్ సిటీలో క్లిష్టమైన థైరాయిడ్ శస్త్రచికిత్స(Thyroid surgery) విజయవంతంగా నిర్వహించారు. 15-10 సెం.మీ. పరిమాణంలో పెరిగిన థైరాయిడ్ ఛాతీలోని మీడియాస్టినమ్ వరకు విస్తరించడంతో వైద్యులు(Doctors) టోటల్ థైరాయిడెక్టమీతో పాటు మినిమల్లీ ఇన్వేసివ్ విధానంలో ఛాతీలోకి విస్తరించిన భాగాన్ని తొలగించారు. ఏడేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో శస్త్రచికిత్స జరగడంతో ఏర్పడిన మచ్చ కణజాలం, మారిన శరీర నిర్మాణం కారణంగా ఆపరేషన్ సవాలుగా మారింది.
డాక్టర్ రాహుల్ రెడ్డి లేవాక(Rahul Reddy Levaka) నేతృత్వంలోని వైద్య బృందం కీలక నరాలు, రక్తనాళాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శస్త్రచికిత్స నిర్వహించింది. అనంతరం రోగి కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మెడలో వాపు క్రమంగా పెరుగుతుంటే, ముఖ్యంగా గతంలో థైరాయిడ్ శస్త్రచికిత్స జరిగిన వారు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచించారు.