కొల్చారం స్టేషన్‌లో ఏఎస్పీ ఆకస్మిక తనిఖీ

19-09-2026 | 04:25pm

కొల్చారం, సెప్టెంబరు 19: కొల్చారం పోలీస్‌స్టేషన్‌(Kolcharam Police Station)ను మెదక్‌ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్‌ సింగ్‌(SP Vikrant Kumar Singh) శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని ముఖ్య రికార్డులు, సీజ్‌ చేసిన వాహనాలను పరిశీలించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని, బ్యాంకులు, ఏటీఎంలు, ప్రధాన కూడళ్ల వద్ద పెట్రోలింగ్‌ ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఫిర్యాదులను సత్వరం పరిష్కరించి, పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్‌ సీఐ ఎం.కృష్ణమూర్తి, ఎస్‌ఐ అహ్మద్‌ మొహినుద్దీన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు