వనస్థలిపురంలో సీఎంఆర్ షాపింగ్ మాల్
ప్రారంభించిన సినీ నటి మీనాక్షి చౌదరి
హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): వనస్థలిపురంలో ప్రముఖ వస్త్ర, ఆభరణాల సంస్థ సీఎంఆర్ షాపింగ్ మాల్ నూతన షో రూంను ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి(Actress Meenakshi Chaudhary) గురువారం ప్రారంభించారు. సీఎంఆర్ గ్రూప్ చైర్మన్ మామిడి వెంకట రమణారావు, డైరెక్టర్ మామిడి బాలాజీ, మాజీ ఎంపీ ఆర్. ఇందిరా, ఇతర ప్రముఖు లు పాల్గొన్నారు. మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. సీఎంఆర్ షాపింగ్ మాల్‌లోని విస్తృతమైన చీరల కలెక్షన్, నాణ్యత తనను ఆకట్టుకున్నాయన్నారు.
కుటుంబ సమేతంగా షాపింగ్ చేయడం ఆనందంగా ఉందని, ప్రజలు తప్పకుండా సీఎంఆర్‌ను సందర్శించి తమకు నచ్చిన ఉత్పత్తులను ఎంపిక చేసుకోవాలన్నారు. ఇం దులో చీరలు, సంప్రదాయ దు స్తులు, పురుషులు, మహిళలు, చిన్నారుల వస్త్రాలు, లైఫ్‌స్టుల్ కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. వనస్థలి పురం ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడంతో పాటు, అత్యుత్తమ షాపింగ్ అనుభూతిని కల్పించడమే తమ లక్ష్యమని యాజ మాన్యం తెలిపింది.