అశ్వాపురం రైల్వే స్టేషన్‌లో మెగా ప్లాంటేషన్
అశ్వాపురం, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): రైల్వే ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న గ్రీన్ ప్లాంట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం అశ్వాపురం రైల్వే స్టేషన్ పరిధిలో(Ashwapuram railway station) మెగా ప్లాంటేషన్ కార్యక్రమం(Mega plantation drive) నిర్వహించారు. సర్పంచ్ బానోత్ సదర్ లాల్, ఉప సర్పంచ్ తుల్లూరి ప్రకాశ్ రావు మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 1,000 మొక్కలు నాటారు.
మొక్కలకు నీరందించేందుకు గ్రామపంచాయతీ తరఫున 5,000 లీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంకర్‌ను అందించారు. నాటిన మొక్కల సంరక్షణకు పంచాయతీ సహకారం అందిస్తుందని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో ఏఓ రాజేంద్ర బాబు, ఏఐ పాషా, టీ ఐ రమ బ్లాక్, గ్రీన్ ప్లాంట్ సభ్యులు రమేష్, వేణు, రామ్మూర్తి, స్టేషన్ మాస్టర్ గౌతమ్, మనీష్, రైల్వే ఉద్యోగులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.






