మహిళా పోలీసుల సాధికారతకు మెంటరింగ్ బలం
- నాయకత్వ నైపుణ్యాల పెంపునకు తెలంగాణ పోలీస్ అకాడమీ ఒప్పందం
- టీఎస్పీఏ డైరెక్టర్ అభిలాష బిస్ట్
రాజేంద్ర నగర్ సెప్టెంబరు 19 (విజయక్రాంతి): మహిళా పోలీసు సిబ్బంది, అధికారుల(Women police personnel and officers) వృత్తిపరమైన అభివృద్ధి, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించే దిశగా అర్ బి వి అర్ ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ స్వచ్ఛంద సంస్థ(Telangana Police Academy Voluntary Organization) మధ్య అవగాహన ఒప్పందం ఏం ఓ యు కుదిరింది. ఏకశిల అడ్మినిస్ట్రేటివ్ భవనంలో జరిగిన కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్(Abhilasha Bisht) ఉదితా చద్దా ఒప్పందంపై సంతకాలు చేశారు.
నిరంతర మార్గదర్శకత్వం అవసరం: మహిళా పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో కీలక బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తున్నారని TGPA డైరెక్టర్ అభిలాష బిస్త్ తెలిపారు. వారు ఎదుర్కొనే సవాళ్లను ధైర్యంగా అధిగమిస్తూ వృత్తిపరంగా ఎదగాలంటే నిరంతర మార్గదర్శకత్వం, మెంటరింగ్, ప్రోత్సాహం అవసరమన్నారు. UMEEౄతో కుదిరిన ఒప్పందం ద్వారా మహిళా పోలీసుల కోసం ప్రత్యేక మెంటరింగ్, మార్గదర్శక, ప్రేరణాత్మక కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడిందన్నారు.
సేవ చేసే అవకాశం సంతోషంగా ఉంది: పోలీసు శాఖలో మహిళా సిబ్బందికి మార్గదర్శకత్వం, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ నైపుణ్యాల(Leadership skills) అభివృద్ధికి సహకరించడం సంతోషంగా ఉందని కో-ఫౌండర్, ప్రెసిడెంట్ గౌరీ మహేంద్ర అన్నారు. మహిళా పోలీసుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
ఏం ఓ యు లో భాగంగా మహిళా పోలీసుల కోసం గైడెన్స్, మెంటరింగ్ సెషన్లు, ప్రేరణాత్మక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వృత్తిపరమైన సామర్థ్యాల పెంపుపై దశలవారీగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో అకాడమీ డిప్యూటీ డైరెక్టర్లు డాక్టర్ చేతన మురళీధర్, వెంకటేశ్వర్లు, కె ఆర్ కే ప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్లు వేమా శ్రీనివాసరెడ్డి, యార్లగడ్డ రాంబాబు, వేముల శ్రీనివాసరావు, నరహరి, ౄSPలు ఆదూరి శ్రీనివాసరావు, దేవారెడ్డి, లా ఫ్యాకల్టీ వరలక్ష్మి, యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమాదేవి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ యాదమ్మ పాల్గొన్నారు. ప్రతినిధులు గౌరీ మహేంద్ర, ఉదితా చద్దా, రహమత్ ఉన్నిసా, కౌశిక్ శర్మ, నందిని, అక్షితారెడ్డి తదితరులు హాజరయ్యారు. చివరగా డి ఎస్ పి ఆదూరి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు.