స్వాతంత్య్ర సమరయోధుడు రాంపల్లి కిష్టయ్యకు మంత్రి శ్రీధర్ బాబు నివాళులు

18-09-2026 | 12:30am

మంథని, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): స్వాతంత్య్ర సమరయోధుడు, మంథని ప్రాంతానికి చెందిన దివంగత రాంపల్లి కిష్టయ్య సేవలను స్మరించుకుంటూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ఆయన నివాసాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా రాంపల్లి కిష్టయ్య చిత్రపటానికి మంత్రి శ్రీధర్ బాబు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్ర కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను నేటి తరాలు స్మరించుకోవాలని ఆయన పేర్కొన్నారు. వారి సేవలు, త్యాగాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

రాంపల్లి కిష్టయ్య కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు