5 September, 2026 | 3:29 PM

బాధితులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చెక్కుల పంపిణీ

05-09-2026 | 02:10pm

నేరడిగొండ, సెప్టెంబర్ 05 విజయక్రాంతి: నేరడిగొండ  మండల కేంద్రంలోని నివాసంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadhav) శనివారం లబ్దిదారులకు సీఏం రిలీఫ్ ఫండ్ చెక్కుల(CM Relief Fund cheques)ను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి వైద్య ఖర్చులకు సీఏం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం రూ. 34.24 లక్షల విలువచేసే చెక్కులను ఎమ్మెల్యే లబ్దిదారులకు అందజేశారు. కార్యక్రంలో బీ ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు