ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

19-09-2026 | 05:34pm

రామచంద్రపురం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జన్మదినోత్సవం(MLA Gudem mahipal reddy birthday) సందర్భంగా ఈరోజు రామచంద్రాపురం బిహెచ్ఇఎల్ బస్ డిపో(BHEL Bus Depot) రోడ్డు  అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్న డైమండ్ పాయింట్‌ వద్ద ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ, బిఆర్ఎస్(BRS) రాష్ట్ర నాయకులు  గూడెం మధుసూదన్ రెడ్డి  ముఖ్య అతిథులుగా విచ్చేసి కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఇఎస్ఐ హాస్పిటల్‌(ESI Hospital)లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అంజయ్య , పార్టీ నాయకులు, కార్యకర్తలు,రామచంద్రాపురం, భారతీనగర్ రెండు డివిజన్లో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు జి.ఎం.ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని  గూడెం మహిపాల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు