టాయిలెట్లను శుభ్రం చేసిన ఎమ్మెల్యే
కాగజ్‌నగర్,(విజయక్రాంతి): గాంధీ జయంతి(Gandhi Jayanti) సందర్భంగా సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్‌బాబు(Sirpur MLA Dr. Palvai Harish Babu) కాగజ్‌నగర్ బస్టాండ్‌లో నిర్వహించిన ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమం(Clean and Green program)లో పాల్గొని టాయిలెట్లను స్వయంగా శుభ్రం చేశారు. మున్సిపల్ సిబ్బంది, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బస్టాండ్ పరిసరాల్లో చెత్తను తొలగించి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం మొక్కలు నాటారు.
గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు తమ ఇళ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల వ్యాప్తిని అరికట్టి డెంగ్యూ తదితర వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. అనంతరం ప్రయాణికులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, కౌన్సిలర్ చిప్పకుర్తి శ్రీనివాస్, ఈర్ల విశ్వేశ్వర్రావు, గొల్లపల్లి వీరభద్రచారి, కొప్పుల శంకర్, హనుమంతరావు, అరుణ్ లోయా, లోనరే రవీందర్, అగ్గిళ్ల శ్రీనివాస్, సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు.