ప్రజలతో మమేకమై ఉంటున్నఎమ్మెల్యే
బోథ్,(విజయక్రాంతి): నియోజకవర్గ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పట్టు సడలిపోకుండా తనదైన శైలిలో ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తూ సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2024లో పోడు భూముల సమస్యపై అసెంబ్లీలో ప్రస్తావించారు. అంతేగాక 2025లో మారుమూల గిరిజన ప్రాంతాలకు గూడేలకు తాండాలకు రోడ్ల నిర్మాణంపై తనదైన అధికార పార్టీ నాయకులను నిలదీస్తూనే నిధులు మంజూరు చేయాల్సిందిగా విన్నవించారు. అంతేగాక గిరిజనేతరులు సాగు చేసుకుంటున్నా పోడు భూముల(Wastelands)కు పట్టాలి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అంతేగాక బోథ్ ప్రజల చిరకాల కోరిక అయిన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయమై అసెంబ్లీలో ప్రస్తావించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయినా ఇప్పటికీ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2026 లో జరిగిన అసెంబ్లీ సమావేశంలో వన్యప్రాణుల వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. మరోవైపు జరుగుతున్న పంట నష్టానికి పరిహారం సత్వరమే వచ్చే విధంగా చూడాలని కోరారు. నియోజకవర్గంలో అనేక గూడేలు తండాలు అటవీ సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలకు సరైన వసతులు లేవని వసతులను కల్పించాలని డిమాండ్ చేశారు.
మంత్రుల పరిచయాలతో
రాజకీయాలలో ఉన్న జాదవ్ అనిల్ కు నియోజకవర్గంలో మంచిపట్టు ఉండడం వల్ల సమస్యలను ఏ కరువు పెడుతున్నారు.. అంతేగాక అధికార పార్టీలో ఉన్న కొంతమంది మంత్రులతో సన్నిద సంబంధాలు ఉండడం వల్ల సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. దీంతో ఆయన అనుచర వర్గం ఎమ్మెల్యే ని వీడకుండా ఉంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అండగా అధినాయకత్వం.. ఎమ్మెల్యేకు బిఆర్ఎస్ పార్టీ ఆది నాయకులు సన్నితంగా ఉండడంతో మంచి భవిష్యత్తు ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఎప్పుడు ప్రజలతోనే ఉంటూ ప్రజా సమస్యలను అజెండాగా తీసుకొని నియోజకవర్గంలో తన పట్టు కోల్పోకుండా ఉండడం కోసం ఎమ్మెల్యే రోజు వారి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.