డైవర్షన్ రహదారి పనుల ప్రారంభం..

05-10-2026 | 04:52pm

పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే జారె..

ములకలపల్లి, అక్టోబర్ 5 (విజయక్రాంతి): ములకలపల్లి మండల కేంద్రానికి సమీపంలోని రాజుపేట పాములేరు వంతెన వద్ద డైవర్షన్ రహదారి నిర్మాణ పనులను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ(MLA Jare Adinarayana) సోమవారం ప్రారంభించారు. తుఫాన్ కారణంగా గత నెల 23వ తేదీన పాములేరు వాగుపై ఉన్న వంతెన వరద ఉధృతికి కూలిపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి.

ప్రస్తుతం ఉన్న ప్రత్యామ్నాయ మార్గం ద్వారా రాకపోకలు సాగుతున్న నేపథ్యంలో వాహనదారులకు ఇబ్బందులు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న విషయాన్ని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గుర్తించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో వంతెన సమీపంలోనే డైవర్షన్ రహదారి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించి సంబంధిత అధికారులతో మాట్లాడి పనులకు  80 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారు.ఇందులో భాగంగా డైవర్షన్ రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎండి జహీరుద్దిన్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు బత్తుల అంజి, తాండ్ర ప్రభాకర్ రావు,పేటేటి నరసింహరావు,కారం సుధీర్, తహసిల్దార్ స్వాతిబిందు, ఎంపీడీవో సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీనాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు