వరి సాగులో ఆధునిక పద్ధతులు
- సమర్థ వినియోగంతో అధిక దిగుబడులు
- పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష (Peddapalli Collector Koya Sriharsha)
పెద్దపల్లి, సెప్టెంబర్ 19: వరి సాగు(Paddy cultivation)లో ఆధునిక పద్ధతులను(Modern methods) అవలంబించి నీటిని సమర్థవంతంగా వినియోగించడం ద్వారా అధిక దిగుబడులు సాధించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష రైతులకు సూచించారు. రంగంపల్లి(Rangampalli)లో సో అండ్ రీప్ క్లుమైటెక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వరి వరహాలు’ రైతుల అభినందన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, నీటి పొదుపు పద్ధతులను పాటించిన రైతులకు ఎకరాకు రూ.500 చొప్పున ప్రోత్సాహక చెక్కులు అందజేశారు.
సంప్రదాయ సాగు విధానాలకు బదులుగా ఆధునిక పద్ధతులను రైతులు స్వీకరించాలని కలెక్టర్ సూచించారు. అవసరమైన సమయంలో మాత్రమే నీటిని అందించడం ద్వారా వృథాను తగ్గించి, పంట దిగుబడులను మెరుగుపర చవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బి. శ్రీనివాస్, సో అండ్ రీప్ క్లుమైటెక్ సీవోవో ఎన్ మురళీధర్, డైరెక్టర్ డి. దివ్యారెడ్డి పాల్గొన్నారు.