విధుల నిర్వహణలో అలసత్వం వద్దు: డా.వెంకటనారాయణ
పశుసంవర్ధక శాఖ కార్యక్రమాలపై నెలవారీ సమీక్ష
గద్వాల,(విజయక్రాంతి): జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి(District Animal Husbandry Officer) డా.జి.వెంకటనారాయణ ఆధ్వర్యంలో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖ పరిధిలో అమలవుతున్న వివిధ కార్యక్రమాల పురోగతిని ఆయన మండలాల వారీగా సమీక్షించారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మ్యాపింగ్, ఆధార్ అప్‌డేషన్, ఎఫ్‌ఎండీసీ, ఏఐ, వీప్‌జీ రాంజీ, ఎన్‌ఎల్‌ఎం, ఎల్‌ఎస్‌డీ, ఎఫ్‌ఆర్‌ఏ, ఎన్‌డీఎల్‌ఎం, సాస్కి, పీపీఆర్ తదితర కార్యక్రమాల అమలుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేసి నిర్ణీత లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. పశువైద్యశాలల్లో రైతులకు(Farmers) అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. భౌతికంగా వ్యాక్సినేషన్ పూర్తిచేసిన వెంటనే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి 100 శాతం లక్ష్య సాధనకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫేసియల్ రికగ్నిషన్ అటెండెన్స్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యాలయ సాంకేతిక అధికారులు, సిబ్బంది, మండల పశువైద్యాధికారులు, పారావెట్ సిబ్బంది పాల్గొన్నారు.






