నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

19-09-2026 | 10:05pm

ప్రత్యేక లైట్లు,భారీ క్రేన్లతో పటిష్ఠ ఏర్పాట్లు

గుమ్మడిదల: గుమ్మడిదల మున్సిపల్(Gummadidala Municipality) పరిధిలోని చెరువుల్లో వినాయక నిమజ్జనం కోసం చేపడుతున్న ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్(Municipal Chairman Chinnapapani Kumar Goud), కమిషనర్ దశరథ్, ఎస్‌ఐ అరుణ్ కుమార్, వార్డు కౌన్సిలర్లు పరిశీలించారు. నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక విద్యుత్ దీపాలు, భారీ క్రేన్లు, భద్రతా చర్యలు, పారిశుధ్య ఏర్పాట్లు, ఇతర అవసరమైన వసతులను ఏర్పాటు చేశారు.

నిమజ్జనం సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. నిమజ్జనం సందర్భంగా ఉత్సవాల నిర్వాహకులు,యువకులు, భక్తులు చెరువుల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువుల్లోకి దిగరాదని సూచించారు. నిమజ్జన సమయంలో పోలీసు, మున్సిపల్ సిబ్బంది సూచనలను పాటిస్తూ వారికి పూర్తిగా సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు