విండీస్‌తో సిరీస్‌కు సుందర్ దూరం

02-10-2026 | 05:00am

నమన్ ధీర్‌కు అవకాశం

ముంబై, అక్టోబర్ 1: వెస్టిండీస్ తో జరిగే టీ20 సిరీస్ కోసం భారత జట్టులో మార్పు జరిగింది. ఈ సిరీస్ నుంచి ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌(Washington Sundar)ను తప్పించారు. అతని స్థానం లో మరో ఆల్‌రౌండర్ నమన్ దీర్‌(Naman Dhir)ను ఎంపిక చేశారు. త్వరలో న్యూజిలాండ్ పర్యటనలో కీలకమైన టెస్ట్ సిరీస్ ఉన్న నేపథ్యంలో సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. సుందర్ గాయం కారణంగా శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తు తం జరుగుతున్న వన్డే సిరీస్‌కు కూడా అ తడు అందుబాటులో లేడు.

అయితే టీ20 సిరీస్‌లో అతడు ఆడుతాడని అంతా భావించారు. కివీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు వాషింగ్టన్ సుందర్‌కు రెడ్ బాల్  క్రికెట్ ఆడే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే టీ20 సిరీస్ నుంచి కూడా బీసీసీఐ త ప్పించింది. అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీలో తమిళనాడు తరపున అతడు బరిలోకి దిగుతాడు. మరోవైపు నమర్ ధీర్ ఇప్పటికే వన్డే ల్లో భారత్ తరపున అరంగేట్రం చేశాడు. రెండో వన్డేలో అతడు గాయ పడినప్పటికి ప్ర స్తుతం బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌కు చెందిన నమన్ మంచి ఫాంలో ఉన్నా డు. 

మరిన్ని వార్తలు