29 August, 2026 | 5:33 PM

మరిపెడ ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం

29-08-2026 03:57 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మరిపెడ ఉన్నత పాఠశాలలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు బయగాని రామ్మోహన్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం, వ్యావహారిక తెలుగు భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా భారత హాకీ రంగానికి ధ్యాన్ చంద్ చేసిన విశేష సేవలను స్మరించుకున్నారు. అలాగే వ్యావహారిక తెలుగు భాషా ఉద్యమ పితామహుడు, బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు తెలుగు భాషను సరళంగా, సహజంగా ఉపయోగించడంతో పాటు మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను ఉపాధ్యాయులు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయురాలు రాజకుమారితో పాటు ఉపాధ్యాయులు శ్రీశైలం, స్వప్న, ప్రకాష్, శౌరి, ప్రసాదరావు, జహీదా బేగం, బాబూరావు, అనిత, సుధా, మంజుశ్రీ, శంకర్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.