కర్ర గణపతికి నిర్మల్ మున్సిపల్ చైర్ పర్సన్ పూజలు
19-09-2026 | 05:37pm
కుబీర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సరిహద్దులోని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా భోకర్ మండలం పాలజ్ గ్రామంలోని ప్రసిద్ధ కర్ర గణపతి ఆలయం వద్ద నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి(Municipal Chairperson Appala Kavya Ganesh Chakravarthy) సందర్శించి పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముందు సార్వజనిక్ పాలజ్ కర్ర గణేష్ మండలి సభ్యులు సంప్రదాయ పద్ధతిలో ఊరేగింపు నిర్వహించి, గణనాథుడికి నైవేద్యం సమర్పించారు. పూజా కార్యక్రమాలు అనంతరం భక్తులకు అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు