రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
17-09-2026 | 11:42pm
సుల్తానాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ బస్టాండ్ సమీపంలో రాజీవ్ రహదారిపై గురువారం మినీ ట్రావెల్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో మానకొండూరు మండలం ఊటూరుకు చెందిన మొర్రి శంకర్(48) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. కూతుర్ని బస్టాండ్ నుండి తీసుకు వెళ్ళడానికి రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు, ఈ మేరకు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.