మాయమైపోతున్న బంధాలు!

20-09-2026 | 05:10am

శ్రీశైలం దూడం :

మనిషి ఒంటరిగా బతకడం కంటే ఒకరికి ఒకరు తోడుగా ఉండటమే ముందుగా నేర్చుకున్నాడు. అక్కడి నుంచే కుటుంబం బలపడింది. ఉ మ్మడి ఇంట్లో తాత, నానమ్మ, తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు(Grandparents, parents, children, and siblings) కలిసి ఉండేవారు. పండుగంటే ఇల్లంతా సందడి. పెళ్లంటే బంధువులంతా ఒకచోట. కష్టమొస్తే పిలవకముందే వచ్చేవాళ్లు. ఇంట్లో విషాదం చోటు చేసుకుంటే కన్నీరు పంచుకునే భుజాలు ఉండేవి. డబ్బు తక్కువైనా.. మనుషుల మధ్య ఆప్యాయతకు కొదవ ఉండేది కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది.

చదువు, ఉద్యోగం, ఉపాధి(Education, Job, Employment) కోసం ఊరు దాటాల్సి వస్తోంది. చిన్న కు టుంబాలు పెరిగాయి. పిల్లలు విదేశాల్లో.. తల్లిదండ్రులు స్వగ్రామాల్లో ఉండటం సా ధారణమైంది. ఈ మార్పును తప్పుపట్ట లేం. కానీ,దూరం పెరిగేకొద్దీ అనుబం ధం తగ్గిపోవడమే ఆందోళన కలిగిస్తోంది. ఫోన్ లో ఒక సందేశం పంపితే బాధ్యత పూర్తయినట్టవుతోంది. కలిసి ఉండే ఇల్లు తగ్గిం ది.. కనెక్ట్ అయ్యే ఫోన్ మాత్రం పెరిగింది.

సెల్‌ఫోన్ ప్రపంచాన్ని(Cellphone world) మన చేతిలోకి తె చ్చింది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నవారిని సైతం క్షణాల్లో పలకరించే అవకా శం ఇచ్చింది. కానీ, పక్కనే కూర్చున్న మనిషితో మాట్లాడే సమయం మాత్రం కరువ వుతోంది. ఒకే ఇంట్లో నలుగురు.. నాలుగు ఫోన్లు. ఒకే భోజన బల్ల..మాటలు మాత్రం తక్కువ. భార్యాభర్తలు ఎదురెదురుగా కూర్చున్నా చూపులు తెరపైనే. తల్లి పిలుపు కంటే ఫోన్‌లో వచ్చే శబ్దమే ముందుగా వినిపిస్తే..మన జీవనశైలిని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిందే. పిల్లల పెంపకంలోనూ ఇదే పరిస్థితి. గోరుముద్ద తినిపిం చాలంటే ఫోన్‌లో బొమ్మ చూపించాలి. మొబైల్ పరికరం పిల్లలను కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంచుతుంది. కానీ తల్లిదండ్రుల ప్రేమను మాత్రం భర్తీ చేయలేదు. 

దాంపత్య జీవితంలో విభేదాలు కొత్తవి కావు. ఒకప్పుడు కుటుంబ పెద్దలు కూర్చొ ని మాట కలిపేవారు. ఇప్పుడు చిన్న అపా ర్థం కూడా పెద్ద గోడగా మారుతోంది. హింస, వేధింపుల విషయంలో చట్టం తన పని తాను చేయాలి. బాధితులకు న్యా యం జరగాలి. అదే సమయంలో బంధం పూర్తిగా తెగిపోయే ముందు పరస్పరం మాట్లాడుకునే అవకాశం కూడా ఉండాలి. ప్రతి సమస్యకు మౌనం పరిష్కారం కాదు.. ప్రతి సమస్యకు గొడవ కూడా పరిష్కారం కాదు.

అన్నదమ్ముల మధ్య ఆస్తి గీతలు.. అక్కచెల్లెళ్ల మధ్య అపార్థాలు.. బాల్యంలో పం చుకున్న అనుబంధాల కంటే పెద్దవవుతున్నాయి. ఒకప్పుడు ఒకే గిన్నెలో తిన్నవా ళ్లు.. ఇప్పుడు ఒకరి ఇంటికి మరొకరు వెళ్లడానికి కూడా కారణం వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఆస్తి పంచుకోవచ్చు.. కానీ అనుబంధాన్ని పంచిపెట్టలేం. బంధం పత్రాల్లో కాదు.. మనసుల్లో నిలుస్తుంది. 

వృద్ధుల ఒంటరితనం మరింత బాధాకరం. జీవితమంతా పిల్లల కోసం గడిపిన తల్లిదండ్రులు.. చరమాంకంలో వారి రాక కోసం ఎదురుచూస్తున్నారు. విదేశాల్లో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల అంత్యక్రియలకు రాలేక.. వీడియోలో చివరి కార్యక్ర మాలను చూడాల్సిన సందర్భాలు కలచివేస్తున్నాయి. సాంకేతికత ముఖాన్ని చూపిం చగలదు.. కానీ చివరి క్షణంలో భుజం తట్టలేదు. స్వరం వినిపించగలదు.. కానీ కన్నీటి ని తుడవలేదు. చివరి చూపు కూడా తెరపైనే మిగిలితే.. మనం ఏం సాధించాం?

ఉపాధ్యాయుడు--, విద్యార్థి బంధం విషయంలోనూ కొత్త ప్రశ్నలు ఎదురవుతు న్నాయి. విద్యార్థుల మధ్య గొడవను ఆపే క్రమంలో బెత్తంతో మందలించినందుకు ఓ ఉపాధ్యాయుడిని రెండు రోజులు పోలీ సు స్టేషన్‌లో కూర్చోబెట్టారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న ఘట న దీనికి ఉదాహరణగా చర్చకు వచ్చింది. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా నిర్ధారించాల్సి ఉన్న ప్పటికీ.. అసలు ప్రశ్న మాత్రం మన ముం దుంది. విద్యార్థులను శారీరకంగా శిక్షించడం సమర్థనీయం కాదు. అదే సమయంలో తప్పుదారి పడుతున్న పిల్లలను సరిదిద్దే బాధ్యతను ఉపాధ్యాయుడి నుంచి పూర్తిగా తీసేయలేం. పిల్లల హక్కులను కాపాడుతూనే.. గురువు మాటకు గౌరవం, క్రమశిక్షణకు విలువ ఉండే సమతుల్యత అవసరం. 

మానవీయత పూర్తిగా మాయమైపోలేదు. ప్రమాదం జరిగినప్పుడు అపరిచితు డిని ఆసుపత్రికి తీసుకెళ్లే చేతులు ఉన్నాయి. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే మనసులు ఉన్నాయి. అవసరంలో రక్తం ఇచ్చే మనుషులు ఉన్నారు. అంటే మనలోని మంచితనం ఇంకా బతికే ఉంది. దానికి కొంచెం చోటిస్తే చాలు. దానికి పెద్ద ఉద్యమాలేమీ అవసరం లేదు. రోజులో కొంతసేపు ఫోన్ను పక్కన పెట్టి తల్లిదండ్రులతో మాట్లాడాలి. పిల్లలతో కూర్చోవాలి. భార్యాభర్తలు ఒకరి మాట మరొకరు వినాలి. అన్నదమ్ములను పలకరించాలి. పండుగను సందేశంగా కాక.. కలయికగా మార్చాలి. పక్కింట్లో ఒంటరిగా ఉన్న వద్ధుడిని చూసి ఒక్కసారి “బాగున్నారా?” అని అడగాలి. ఆ ఒక్క మాట కూడా ఒక మనిషికి రోజంతా తోడుగా నిలవొచ్చు.

అభివృద్ధి అంటే రోడ్లు, భవనాలు, సాంకేతికత మాత్రమే కాదు. మనిషి పక్కన మనిషి నిలబడే సంస్కారం కూడా అభివృద్ధిలో భాగమే. ప్రపంచం మొత్తం ఒక తెర పైకి వచ్చినా.. ఇంట్లోని మనుషుల మధ్య మాట లేకపోతే ఆ అనుసంధానానికి అర్థం ఏముంది? కాలం మారడం సహజం.. మనసులు దూరం కావడం మాత్రం ప్ర మాదం. తెరను కాసేపు పక్కనపెట్టి మనిషిని చూడాలి. సందేశాన్ని ఆపి మనసు విప్పి మాట్లాడాలి. బంధం తెగిపోయిన తర్వాత బాధపడటం కంటే.. అది తెగకముందే ఒక అడుగు ముందుకు వేయాలి. కుటుంబం నిలిస్తే సమాజం నిలుస్తుంది. మానవీయత నిలిస్తేనే మన నాగరికతకు విలువ ఉంటుంది. 

 ఫ్రీలాన్స్ జర్నలిస్టు, 9133947176

మరిన్ని వార్తలు