వడ్ల కొనుగోళ్లు ఫార్మర్ రిజిస్ట్రీతో అనుసంధానం

24-09-2026 | 03:33pm

నాగిరెడ్డిపేట్,సెప్టెంబర్ 24 (విజయ క్రాంతి):ప్రతి వానకాలం మరియు యాసంగి వడ్ల(Yasangi paddy) కొనుగోళ్ళు అనేవి పట్టా పాస్ బుక్(Patta Passbook) ఆధారంగా జరిగేవి.ఐతే ఈ వానకాలం నుండి ఈ వడ్ల కొనుగోళ్లు అనేవి ఫార్మర్ రిజిస్ట్రీతో అనుసంధానం చేయబడతాయి.భూములు ఉన్న ప్రతి రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకొని ఫార్మర్ ఐడినీ పొందవలసి ఉంటుంది.ఈ విధంగా ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకొని ఫార్మర్ ఐడినీ పొందినవారు మాత్రమే సెంటర్స్లో వడ్లు కొనుగోలుకు అర్హులు.

కావున ఇప్పటివరకు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకొని రైతు సోదరులు వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి నమోదు చేసుకోగలరు.పట్టా పాస్ బుక్,ఆధార్ కార్డు,ఆధార్ లింక్డ్ ఫోన్ నంబర్లు కావలసి ఉందని మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్ తెలిపారు. కావున మండలంలోని రైతు సోదరులు ఈ యొక్క ముఖ్య గమనిక గుర్తుంచుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు