6 September, 2026 | 3:28 PM

పాల్వంచ పట్టణానికి పూర్వ వైభవం రావాలి

06-09-2026 | 01:07pm

2x800 మెగావట్ల కొత్త ప్లాంట్లను నిర్మించాలి

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డ రవి కుమార్

సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి పి తులసి రామ్ 

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 6, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ లో పాత ప్లాంట్ ను కూల్చిన చోటే 800 మెగావాట్ల కొత్త ప్లాంట్లను ప్రారంభించాలని వక్తలు డిమాండ్ చేశారు. పాల్వంచ సమగ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఇంజనీరింగ్ అసోసియేషన్(Engineering Association) హాలులో సీతారాం రెడ్డి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో పై నాయకులు మాట్లాడుతూ గతంలో కేటీపీఎస్ ఏపీ స్టీల్ ,స్పాంజ్ ఐరన్, నవభారత్ ఉద్యోగులతో ఎంతో వైభవంగా కనిపించిన పాల్వంచ నేడు పరిశ్రమల మూత ఉద్యోగులకు దింపు కారణంగా చిన్న పోయిందన్నారు.

గతంలో వివిధ ప్రాంతాల నుండి బ్రతుకుతెరువు కోసం పాల్వంచ వచ్చే వాళ్ళని ఇప్పుడు స్థానిక ప్రజలు యువత ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలసలు పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.  దీనికి పాలక ప్రభుత్వాలేదే బాధ్యత అన్నారు . ఇప్పటికైనా పాల్వంచ సమగ్ర అభివృద్ధి చెందాలంటే కూల్చిన స్థలంలోనే కొత్త ప్లాంటును ప్రారంభించేలా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కొత్త ప్లాంట్ ను సాధించాలని, దానికోసం జరిగే పోరాటానికి సిఐటియు , సిపిఎం పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో పార్టీ టౌన్ కార్యవర్గ సభ్యులు కే సత్య, సత్యవాణి శాఖ కార్యదర్శి యాకూబ్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు