బీసీ రాజ్యాధికారమే ఏకైక మార్గం
టీఆర్పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయాక్రాంతి): టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) చేపట్టిన ‘బీసీ రాజ్యాధికార యాత్ర(BC Political Empowerment Yatra)’ మూడో రోజు శనివారం శంషాబాద్(Shamshabad) నుంచి నందిగామ వరకు కొనసాగింది. పాదయాత్రలో భాగంగా మార్గమధ్యంలో ఆర్టీసీ కార్మికుల(RTC workers)తో మల్లన్న ముచ్చటించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉద్యోగపరమైన ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
ఇళ్లు లేక, ప్రభుత్వం నుంచి సరైన సాయం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బుడగ జంగాల కుటుంబాలను మల్లన్న పరామర్శించారు. యాత్రలో మల్లన్న మాట్లాడుతూ.. 80 ఏళ్లుగా రెడ్డి, వెలమ, కమ్మ సామాజిక వర్గాల చేతుల్లోనే అధికారం కేంద్రీకృతమైందని అన్నారు. “మన బతుకులు మారాలన్నా.. మన హక్కులు మనకు దక్కాలన్నా తెలంగాణలో బీసీ రాజ్యాధికారం రావాలి. బీసీలు రాజకీయంగా చైతన్యవంతులై తమ హక్కుల కోసం ఐక్యంగా ముందుకు రావాలి” అని మల్లన్న పిలుపునిచ్చారు.