ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి

08-09-2026 | 01:28am

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, చట్టపరమైన పరిష్కారం అందించేందుకు జిల్లా ఎస్పీ నితికా పంత్(SP Nitika Pant)  ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం(Prajavani program) నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను ఎస్పీకి నేరుగా వివరించారు. ఫిర్యాదుల సమస్యను  విన్న ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత సమయంలో చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతతో పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోలీస్ శాఖ నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ నితికా పంత్ కోరారు.

మరిన్ని వార్తలు