21 August, 2026 | 9:30 PM

జనరిక్ మందుల పేర్లతోనే ప్రిస్క్రిప్షన్లు ఇవ్వాలి

21-08-2026 06:33 PM

స్పష్టమైన చదువ గలగేల ఔషధాల పేర్లు రాయాలి

IMAకు SAV వినతి

కొత్తగూడెం,(విజయక్రాంతి): ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన వైద్య సేవలు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రిస్క్రిప్షన్ అందరికి అర్థం అయ్యే పద్ధతిలో రాయాలని  కోరుతూ సమగ్ర అభివృద్ధి వేదిక (SAV) ఆధ్వర్యంలో IMA అధ్యక్షులు డా. శ్రీనివాసరావు, కార్యదర్శి డా. B.S. రావు, ట్రెజరర్ డా. ప్రవీణ్లకు వినతిపత్రం మరియు DM&HO  ఇచ్చిన సర్క్యులర్ ను శుక్రవారం సమర్పించారు.

SAV వ్యవస్థాపక అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రముఖ విద్యావేత్త మాండవ సుబ్బారావు, రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్  ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు బిజీర్ వెస్లీ, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు ఎం . మోహన్ రావు,  సిహెచ్ తిరుపాల్ మాట్లాడుతూ... ప్రైవేట్ వైద్య రంగంలో వైద్యులు, ఆసుపత్రులు ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అయితే ఖరీదైన బ్రాండెడ్ మందుల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోందని పేర్కొన్నారు.

ప్రిస్క్రిప్షన్లలో మందుల బ్రాండ్ పేర్లతో పాటు లేదా వాటికి బదులుగా  (జనరిక్ పేరు) స్పష్టంగా సూచించే విధానాన్ని ప్రోత్సహించాలని ఐఎంఏ నాయకులను కోరినట్లు  తెలిపారు. జనరిక్ మందులు తక్కువ ధరలలో అందుబాటులో ఉండటం వల్ల రోగులకు మందుల ఖర్చు తగ్గడంతో పాటు దీర్ఘకాలిక చికిత్స అవసరమైన వారికి ఆర్థికంగా ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు.

 వైద్యుల సూచనల మేరకు ఫార్మసీలలో జనరిక్ మందులు అందుబాటులో ఉండేలా అవగాహన కల్పించడం, రోగులకు మందుల ధరలు–జనరిక్ ప్రత్యామ్నాయాలపై తగిన సమాచారం అందించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందుల లభ్యతను మెరుగుపరచేందుకు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మరియు ప్రిస్కిప్షన్ కూడా అందరికి అర్థమయ్యే విధంగా రాయాలని కోరారు.ఇండియన్ మెడికల్ అసోసియే షన్, స్థాయిలో ఈ అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలకు అందుబాటులో ఉండే ఆరోగ్య సేవల కోసం వైద్యులు  సహకారం అందించాలని, యస్ ఏ వి ప్రతినిధి బృందం కోరింది. ఐ ఎం ఏ నాయక త్వం స్పందిస్తూ, మెమో రాండంలోని అంశాలను ప్రతి డాక్టర్ దృష్టికి తీసుకొని పోయి తమ వంతు కృషి చేస్తామని అన్నారు.