అక్రమ నిర్మాణాలపై మౌనమేల?
- సెట్‌బ్యాకులు లేకుండా అపార్ట్మెంట్లు
- రోడ్లపైనే ట్రాన్స్ఫార్మర్లు, ర్యాంపులు
- ఓసీల తర్వాత అదనపు అంతస్తుల నిర్మాణాలు
- ఫిర్యాదు చేస్తేనే అధికారులు స్పందిస్తారా ?
- రాజేంద్రనగర్ డీసీ, టౌన్ ప్లానింగ్ అధికారులపై అవినీతి ఆరోపణలు!
రాజేంద్రనగర్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): అక్రమ వెంచర్‌పై(Illegal venture) అధికారులు చర్యలు తీసుకోవడం స్వాగతించదగ్గ విషయమే. అయితే అదే ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు(Town planning officials) ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్(GHMC Rajendranagar Circle)-19 పరిధిలోని గంధంగూడలో సుమారు నాలుగు ఎకరాల్లో ఏ ర్పాటు చేసిన అనధికారిక వెంచ్ప గురువారం అధికారులు చర్యలు తీసుకుని వెంచర్ లో అనధికారికంగా నిర్మిస్తున్న ఓ భవనాన్ని కూల్చి వేసి రోడ్లను ధ్వంసం చేశారు. అయితే ఈ చర్యలు ఫిర్యాదుల అనంతరం మాత్రమే జరిగాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫిర్యాదు వస్తేనే చర్యలా?
ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన త ర్వాతే అధికారులు రంగంలోకి దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదులు లేకపోయినా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిం చి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన బా ధ్యత టౌన్ ప్లానింగ్ విభాగంపై ఉందని స్థానికులు అంటున్నారు. అక్రమ నిర్మాణా లు పూర్తయ్యే వరకు అధికారులు పట్టించుకోకపోవడంపై అవినీతి ప్రశ్నలు తలెత్తుతు న్నాయి.
రోడ్లపైనే ర్యాంపులు.. ట్రాన్స్ఫార్మర్లు..
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కొన్ని అపార్ట్మెంట్ల వద్ద నిబంధనలకు అనుగుణం గా సెట్బ్యాక్లు వదలకుండా నిర్మాణాలు చేపడుతున్నారన్న ఆరోపణలున్నాయి. రోడ్లపై ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం, సెల్లార్లకు వెళ్లేందుకు రోడ్డు వైపునే భారీ ర్యాంపులు నిర్మించడం వంటి వాటిపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఫైర్‌సేఫ్టీ, భవన నిర్మాణ నిబంధనలను ఉ ల్లంఘిస్తున్నారనే ఫిర్యాదులున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.
ఓసీ తర్వాత అదనపు అంతస్తులా?
కొన్ని అపార్ట్మెంట్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) వచ్చిన అనంతరం అదనంగా ఒకటి, రెండు అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విష యాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సం బంధిత నిర్మాణాలపై తగిన చర్యలు కనిపించడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఓసీ అనంతరం చేపట్టే అదనపు నిర్మాణాలపై అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారా? నిబంధనల ఉల్లంఘనల ను గుర్తిస్తే ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అన్నది స్పష్టం కావాల్సి ఉంది.
టౌన్‌ప్లానింగ్‌లో వసూళ్ల ఆరోపణలు..
టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి చుట్టూ అక్రమ వసూళ్లకు సంబంధించిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ని బంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న కొందరు బిల్డర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఉన్న తాధికారులు దీని పై విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
అధికారుల పర్యవేక్షణ ఎక్కడ?
అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, నిర్మాణ దశలోనే వాటిని గుర్తించి అడ్డుకోవడం జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం బాధ్యత. అయితే రాజేంద్రనగర్ సర్కిల్లో పలు నిర్మాణాల విష యంలో అధికారుల పర్యవేక్షణపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారా? ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై ఇప్పటివరకు ఎన్ని చర్యలు తీసుకున్నారు? అనే వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది.
ఫోన్లో స్పందించని డీసీ..
రాజేంద్రనగర్ సర్కిల్లో అక్రమ నిర్మాణాలు, టౌన్ ప్లానింగ్ విభాగంపై వస్తున్న ఆరోపణలపై వివరణ కోరేందుకు డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డిని ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా స్పందించలేదు. అధికారుల వివరణ అందిన పక్షంలో ప్రచురించేందుకు అవకాశం ఉంటుంది.