ఇక దేశంలో ప్లాస్టిక్ నోట్లు

05-10-2026 | 09:47am

మనకు ఊహ తెలిసినప్పటి నుంచి దేశంలో రూపాయి నాణేలు, కాగితపు నోట్లే చలామణిలో ఉన్నాయి. కానీ త్వరలోనే మన చేతుల్లోకి ప్లాస్టిక్ నోట్లు (polymer notes) వచ్చే అవకాశం కనిపిస్తోంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన (announcement) చేసింది.రూ.10, రూ.20 విలువ కలిగిన ప్లాస్టిక్ నోట్లను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ఫీల్డ్ ట్రయల్స్ (field trials) నిర్వహించనున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఈ నోట్ల తయారీకి అవసరమైన ప్రత్యేక మెటీరియల్‌ను సరఫరా చేసేందుకు కంపెనీల నుంచి ప్రతిపాదనలను కూడా ఆహ్వానించింది.

ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని ఆర్బీఐ భావిస్తోంది. ప్రపంచంలోని పలు దేశాల్లో ఇప్పటికే పాలిమర్ నోట్లు వినియోగంలో ఉన్నాయి. ఇదే విధానాన్ని భారత్‌లోనూ అమలు చేయాలనే ఉద్దేశంతో ఆర్బీఐ ప్రతిపాదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.దీంతో రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్ల ఫీల్డ్ ట్రయల్స్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ (green signal) ఇచ్చినట్లు సమాచారం. ప్రయోగాలు విజయవంతమైతే.. భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంటే.. త్వరలో మన జేబుల్లో కాగితపు నోట్ల స్థానంలో పాలిమర్ నోట్లు కనిపించే రోజులు రావచ్చన్నమాట!

మరిన్ని వార్తలు