రేఖాగుప్తా, కేజ్రీవాల్‌కు ‘సర్’ నోటీసులు

20-09-2026 | 05:05am
  1. ఎన్యూమరేషన్ ఫారమ్‌ల్లో సరిగా లేని వివరాలు 
  2. ఢిల్లీలో 33.13 లక్షల మంది ఓటర్లకు కూడా..

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19 : కొనసాగుతున్న సర్ (ప్రత్యేక సమగ్ర సవరణ)(Special Comprehensive Revision) ప్రక్రియలో భాగంగా సమర్పించిన వివరాలలో లోపాలు ఉన్నందున, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా(Rekha Gupta), ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)తో సహా పలువురు ప్రముఖ ఓటర్లకు ఎన్నికల సంఘం శనివారం నోటీసులు జారీ చేసింది. సీఎం సంబంధించిన వివరాలు ‘ధృవీకరించాం’ అని, నవంబర్ 4న విడుదల కానున్న షాలిమార్ బాగ్ నియోజకవర్గ(Shalimar Bagh Constituency) తుది ఓటర్ల జాబితా(Voter List)లో ఆమె పేరు చేర్చుతామని సీఈఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఎన్యూమరేషన్ ఫారమ్‌లో అందించిన వివరాల ఆధారంగా, తార్కిక అసమానతలు ఉన్న జాబితాలో రేఖాగుప్తాకు సంబంధించిన వివరాలు గుర్తించామ ని పేర్కొంది. ఢిల్లీలో ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న 33.13 లక్షల మంది ఓటర్లకు, వారి ఎన్యూమరేషన్ ఫారమ్ వివరాలలో ఉన్న లోపాల వల్ల నోటీసులు పంపుతామని తెలిపింది. ఇప్పటివరకు 31.63 లక్షల మంది ఓటర్లకు నోటీసులు అందాయని వెల్లడించింది. వయస్సులో తేడా ఉండడంతో సీఎం రేఖా గుప్తాకు నోటీసు ఇచ్చారు.

ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు వీరేంద్రసచ్దేవా, ఎంపీ కపిల్ సిబల్, బీజేపీ నేత సుధాంశు మిట్టల్లకు నోటీసులు పంపారు. కేజ్రీవాల్‌కు, గత సర్ వివ రాలతో అనుసంధానం కాకపోవడం వల్ల నోటీసు వచ్చింది. ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, తల్లిదండ్రులు, కుమారుడికి కూడా నోటీసులు జారీచేశారు.

మరిన్ని వార్తలు