బస్సు బీభత్సం..కాలు నుజ్జునుజ్జు

05-10-2026 | 09:58am

కరీంనగర్‌లోని కోర్టు చౌరస్తాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (road accident) చోటుచేసుకుంది. మంచిర్యాల వైపు వెళ్తున్న కరీంనగర్-2 డిపోకు చెందిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు (electric bus) అదుపుతప్పి అంబేద్కర్ విగ్రహం వద్ద అటుగా వెళ్తున్న వాహనదారులను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బస్సు ముందువైపు టైర్ కింద ఓ ద్విచక్ర వాహనం చిక్కుకుంది. బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి కాలు నుజ్జునుజ్జు కావడంతో వెంటనే 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గాయపడిన ఇద్దరి వివరాలు (details) ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు (investigation) చేస్తున్నారు.

మరిన్ని వార్తలు