భారీ వర్షానికి జలమయమైన పాఠశాల ప్రాంగణం
24-09-2026 | 02:30pm
కోనరావుపేట, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి ):కోనరావుపేట మండలం కనగర్తి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల(Kangarti Mandal Parishad Primary School) ఆవరణ బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పూర్తిగా జలమయమైంది. పాఠశాల ప్రాంగణంలో వర్షపు నీరు పెద్దఎత్తున నిలిచిపోవడంతో చెరువును తలపిస్తోంది. దీంతో గురువారం ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిలిచిపోవడంతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సమస్యను అధికారులు పరిశీలించి, వర్షపు నీరు నిలవకుండా శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.