ప్రాణం పోసే చేతిలో.. ప్రాణం తీసే ఆయుధాలు.!
వినాయక నిమజ్జనంలో తల్వార్లతో వైద్యుల విన్యాసాల వీడియో వైరల్.
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): గణపతి నవరాత్రి ఉత్సవాల్లో (During the Ganapathi Navaratri celebrations) భాగంగా మంగళవారం అర్ధరాత్రి జరిగిన నిమజ్జన వేడుకల్లో ఇద్దరు ప్రైవేట్ ఆసుపత్రి(Private hospital) వైద్యులు తల్వార్లతో చేసిన విన్యాసాలు స్థానికంగా తీవ్ర విమర్శలకు తవిస్తోంది. భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని పోలీసులు పదేపదే సూచించారు. కానీ నిమజ్జన వేడుకల్లో హద్దు మేరీ వైద్యం చేసి ప్రజల ప్రాణాలను కాపాడే చేతిలో ప్రాణం తీసే ప్రమాదకరమైన తల్వార్లను చేతబూని విన్యాసాలు చేస్తూ డాన్సులు చేయడం తీవ్ర కలకలం రేగింది.
కొందరు ఆ విన్యాసాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ గా మారింది. గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ హుందాగా వ్యవహరించాల్సిన వైద్యులే చిల్లర చేష్టలతో చిందులు వేయడమెంటని చర్చ జరుగుతోంది. బహిరంగ ప్రదేశంలో ఆయుధాలను ప్రదర్శించడం చట్టరీత్యా నేరం అని తెలిసినప్పటికీ అది పట్టించుకోకపోవడం విశేషం.