ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణకు కాంగ్రెస్ నాయకుల నివాళులు

04-10-2026 | 02:28pm

రామగిరి, అక్టోబర్ 4 (విజయక్రాంతి): రామగిరి మండలం సుందిళ్ల గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొరకొప్పుల సత్యనారాయణ(Senior Congress Leader Satyanarayana) మృతి చెందారు. ఆయన స్వగ్రామమైన సుందిళ్లలో నిర్వహించిన అంత్యక్రియల్లో రామగిరి మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొని పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కొరకొప్పుల సత్యనారాయణ మృతి కాంగ్రెస్ పార్టీకి, సుందిళ్ల గ్రామానికి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

ఈ కార్యక్రమంలో రామగిరి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొరకొప్పుల తులసిరామ్ గౌడ్, ఉమ్మడి కామాన్‌పూర్ మండల మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణ రెడ్డి, ఉమ్మడి రత్నాపూర్ మాజీ ఎంపీటీసీ ముస్త్యాల శ్రీనివాస్, రామగిరి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మోత్కూరి అవినాష్ గౌడ్, సుందిళ్ల గ్రామ సర్పంచ్ మస్కుల నరేందర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు గర్రెపల్లి ప్రవీణ్ గౌడ్, మాజీ అధ్యక్షుడు జనగామ కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు