రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురి మృతి
- రంగారెడ్డి జిల్లా పాలమాకుల వద్ద డివైడర్‌ను ఢీకొన్న కారు
- ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
- శామీర్‌పేటలో ఓఆర్‌ఆర్‌పై మినీ వ్యాన్‌ను ఢీకొట్టిన వ్యాన్
- ముగ్గురు మృతి
శంషాబాద్(రాజేంద్రనగర్)/శామీర్‌పేట్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) పాలమాకుల వద్ద డివైడర్ ను కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందగా.. మేడ్చల్ జిల్లా(Medchal District) శామీర్‌పేటలో ఓఆర్‌ఆర్‌పై మినీ వ్యాన్‌ను వ్యాన్ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా(Mahabubnagar District) నవాబ్‌పేట మండలం మెట్టుగడ్డ తండాకు చెందిన కుటుంబ సభ్యులు ఉపాధి నిమిత్తం కొన్నేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు.
గణేశ్ నిమజ్జనం వేడుకల్లో పాల్గొనేందుకు శుక్రవారం కారులో స్వగ్రామం వెళ్లారు. శుక్రవారం రాత్రి తిరు గు ప్రయాణంలో పాలమాకుల వద్దకు రాగానే కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న కేతావత్ లింబ్యా (54), ఆయన భార్య జమున (45), కేతావత్ మాన్సింగ్ (48), కేతావత్ వస్రాం (45) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ సబావత్ అశోక్ తీవ్రంగా గాయపడ్డాడు. శంషాబాద్ పోలీసులు ఘటనా స్థలా నికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడిన డ్రైవర్ అశోక్‌ను అత్యవసర చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు శంషాబాద్ సీఐ సురేందర్రెడ్డి తెలిపారు. శామీర్‌ఫేట్ ఓఆర్‌ఆర్‌పై శనివారం తెల్లవారుజామున ఘోరరోడ్డు ప్రమాదం జరి గింది. చేగుంట నుంచి స్క్రాప్ లోడుతో మినీ వ్యాన్ ఓఆర్‌ఆర్ నుంచి కీసర వైపు బయలుదేరింది. శామీర్‌పేట్‌కు రాగానే టైర్ పంచర్ అయింది. టైర్ మార్చేందుకు రింకు, ఇబ్ర హీం ప్రయత్నిస్తుండగా ఇస్మాయిల్, హుస్సే న్ ఇద్దరు వాహనం కింద ఉన్నారు.
ఇంతలో ఏపీకి చెందిన వ్యాన్.. మినీ వ్యాన్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రింకు, ఇస్మాయిల్, హుస్సేన్ అక్కడిక్కడే మృతి చెందగా ఇబ్రహీంకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్ నాగరాజు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. శామీర్‌పేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.