ఘనంగా ముగిసిన ఎస్‌జీఎఫ్‌ క్రీడలు..

17-09-2026 | 11:23pm

* వాలీబాల్‌, ఖోఖోలో కుర్తివాడ హవా.. కబడ్డీలో పాపన్నపేట సత్తా

పాపన్నపేట,సెప్టెంబర్‌ 17: ఎస్‌జీఎఫ్‌ పాపన్నపేట మండలస్థాయి క్రీడా పోటీలు(SGF Papannapet Mandal-level Sports Competitions) గురువారం ఉత్సాహంగా ముగిశాయి. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు వాలీబాల్‌, ఖోఖో, కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. విజేతలు, రన్నరప్‌లుగా నిలిచిన జట్లకు ఎంఈఓ ప్రతాప్ రెడ్డి, నిర్వాహకులు ట్రోఫీలు అందజేశారు.

వాలీబాల్‌, ఖోఖో పోటీల్లో కుర్తివాడ సత్తా చాటగా, కబడ్డీలో పాపన్నపేట విద్యార్థులు ప్రతిభ చూపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంఈఓ ప్రతాప్ రెడ్డి, పాపన్నపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, ఉపాధ్యాయులు, నిర్వాహకులు తదితరులు అభినందించారు.

మరిన్ని వార్తలు