శర్వానంద్‌కు జోడీగా మానస వారణాసి.. ‘జార్జ్‌క్రిష్’లో హీరోయిన్
చార్మింగ్ స్టార్ శర్వా 'జార్జ్ క్రిష్'లో హీరోయిన్ గా మానస వారణాసి
'నారీ నారీ నడుమ మురారీ', 'బైకర్' విజయాలతో జోష్‌లో ఉన్న చార్మింగ్ స్టార్ శర్వానంద్(Charming Star Sharwanand), దర్శకుడు శ్రీను వైట్లతో తొలిసారిగా చేతులు కలిపారు. వీరి కాంబినేషన్ లో 'జార్జ్ క్రిష్' పండుగ సీజన్లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అలరించబోతోంది. ఏటీవీ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా, అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం 2027 జనవరి 14న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది. గతంలో విడుదల చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్లో కలర్‌ఫుల్ ఫెస్టివ్ లుక్ ఆకట్టుకుంది. అందులో శర్వానంద్ హీరోయిన్ను ఎత్తుకున్న సిల్హౌట్ ఆసక్తిని పెంచింది.
తాజాగా ఈ సినిమాలో మానస వారణాసి హీరోయిన్గా నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘కపుల్ ఫ్రెండ్లీ’ తో సూపర్ హిట్ అందుకున్న మానస వారణాసి.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్‌కు జోడీగా కనిపించనున్నారు. టైటిల్ పోస్టర్‌ను బట్టి సినిమాలో లవ్ స్టోరీకి కీలక ప్రాధాన్యత ఉండబోతోంది. మానస పాత్ర కథలో కీలకంగా ఉండనుంది. ఫస్ట్ బూస్టర్‌ను రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి అటాప్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. కేవీ గుహన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. నందు సవిరిగాన, గోపీ మోహన్ రైటింగ్ డిపార్ట్మెంట్లో భాగం కాగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.