సర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి..

18-09-2026 | 10:42pm

సబ్ కలెక్టర్ హర్ష చౌదరి 

బెజ్జూర్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలో శుక్రవారం సబ్ కలెక్టర్ హర్ష చౌదరి(Sub-Collector Harsha Chowdary) పర్యటించారు. ఈ సందర్భంగా బెజ్జూర్, సిద్ధాపూర్, మర్తిడి, లంబడి గూడ, బారెగూడ, ముంజంపల్లి గ్రామ పంచాయతీలలో నిర్వహిస్తున్న సర్ ప్రక్రియపై బిఎల్ఓ లతో మాట్లాడారు. నోటీసులు ఇచ్చిన ఓటర్ల ఇంటికి ఉదయం సాయంత్రం నేరుగా వెళ్లి సంబంధిత పత్రాలను సేకరించాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి ఓటు హక్కు తప్పిపోకుండా జాగ్రత్తగా ఓటర్ నమోదు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించి, తరగతి గదిలో విద్యార్థినులతో మాట్లాడారు. తరగతి గదిలో పలు ప్రశ్నలను వేసి విద్యార్థినులచే సరైన సమాధానాలు రాకపోవడంతో ఉపాధ్యాయులపై అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులు లేకపోవడంతో తెలుగు బోధన సక్రమంగా జరగడం లేదని విద్యార్థినులు సబ్ కలెక్టర్ కు తెలియజేశారు.

మరిన్ని వార్తలు