హజ్రత్ ఇబ్రహీం దౌలా ఉర్స్ షరీఫ్ పాల్గొన్న ఎస్పి

19-09-2026 | 05:10pm

నిర్మల్ సెప్టెంబర్ 19 ( విజయ క్రాంతి): నిర్మల్‌లోని శరత్ మహల్ ప్రాంతంలోని మస్జిద్-ఎ-ఖుబా వద్ద నిర్వహించిన పవిత్ర సందల్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల (District SP Dr. G. Janaki Sharmila) ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మసీదు కమిటీ సభ్యులు ఎస్పీని శాలువాతో ఘనంగా సత్కరించారు. సందల్ వేడుకలు మత సామరస్యానికి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ఎస్పీ పేర్కొన్నారు. ఈ ప్రార్థనల్లో డీఎస్పీ పి. శ్రీనివాస్, సీఐలు కృష్ణ, సమ్మయ్య, గోవర్ధన్, ఎస్‌ఐలు గణేష్, శ్రీకాంత్, లింబాద్రి, గోపీ, ఆర్‌ఎస్‌ఐ రవి కుమార్, మసీదు కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు