5 September, 2026 | 10:52 PM

ఉపాధ్యాయులు, పాత్రికేయులు, ఇంజనీర్లకు ఘన సన్మానం

05-09-2026 | 09:42pm

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఉపాధ్యాయ, జర్నలిస్ట్, ఇంజనీర్ దినోత్సవాలను పురస్కరించుకుని  వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కన్యకాపరమేశ్వరి ఆలయం(Kanyaka Parameshwari Temple)లో ఆత్మీయ సన్మాన కార్యక్రమం(Spiritual tribute ceremony) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు, సీనియర్ పాత్రికేయులు, ఇంజనీర్లను వాసవి క్లబ్ సభ్యులు, ఆర్య వైశ్య సంఘం నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడుతూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు మరియాల ఉదయ్ బాబు, ప్రధాన కార్యదర్శి బాల శ్రీనివాస్, ఆర్య వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు చిలువేరు వెంకన్న, వాసవి టెంపుల్ అధ్యక్షుడు రావుల శంకర్, ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు ముక్త సురేష్, ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ మల్టిపుల్ వైస్ ప్రెసిడెంట్ ఎకరాల శ్రీనివాస్‌తో పాటు ఉపాధ్యాయులు, పాత్రికేయులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు