ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా
ముకరంపుర, ఆగస్టు 21(విజయక్రాంతి): జీవో 97 ను రద్దు చేయాలని కోరుతూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి శ్రీకాంత్ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ జీవో వల్ల సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థిని విద్యార్థులు చాలా నష్టపోవాల్సి వస్తుందని ఉపాధి అవకాశాలు పూర్తిగా కోల్పోతారని, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరుతో ప్రైవేట్ యూనివర్సిటీలకు విద్యార్థుల భవిష్యత్తు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దారాదత్తం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా ముగింపు దశలో విద్యార్థులు ఒకేసారి మూకుమ్మడిగా భారీకేడ్ల ను దాటి కలెక్టర్ కార్యాలయం లోనికి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉన్న పోలీసులు వారిని ఆపే క్రమంలో విద్యార్థులకు పోలీసులకు తోపులాట జరిగింది. అప్పటికే సిద్ధంగా ఉన్న వాహనాల్లో విద్యార్థులను, ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు.






